సాధ్వి ప్రగ్యాకు ఈసి క్లీన్‌చిట్‌

sadhvi pragya singh
sadhvi pragya singh

న్యూఢిల్లీ: భోపాల్‌ బిజెపి అభ్యర్ధి సాధ్వీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌కి భారత ఎన్నికల సంఘం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇటీవల ఈసి మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారంపై నిషేధాన్ని ఉల్లంఘించారంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె వివరణ విన్న ఈసి ఇవాళ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల సమయంలో కూడా ప్రగ్యాసింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ కాంగ్రెస్‌ ఈసికి ఫిర్యాదు చేసింది. దీంతో కాంగ్రెస్‌ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా ఎన్నికల అధికారి సాధ్వికి నోటీసులు జారీ చేశారు. కాగా ఆమె ఆ ఆరోపణలను ఖండిస్తూ తన స్పందన పంపారు. తన గురించి అసత ప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్‌ మాజీ చీఫ్‌ హేమంత్‌ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల ఈసి ఆమెను మూడు రోజుల పాటు ప్రచారం నుంచి దూరంగా ఉండాలని నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/