ఈసీ స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం

vanteru pratap reddy
vanteru pratap reddy

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సిఎం కేసీఆర్‌కు డిపాజిట్‌ కూడూ దక్కదని ఆయన అన్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులనూ లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈసీ స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. పోలింగ్ శాతాన్ని ఈసీ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తి ఉన్నారని, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా అని నిలదీశారు. టీఆర్ఎస్‌కు పోలీసులు, అధికారులు తాబేదార్లుగా మారారని ఆయన దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని వంటేరు డిమాండ్ చేశారు. తన ఓటమికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, తనకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీకి లేదా అని మరోసారి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు.