రాజీవ్ కుమార్ కు ఈసి నోటీసులు

rajiv kumar
rajiv kumar, niti aayog chairman

హైద‌రాబాద్: దేశంలోని నిరుపేద‌ల‌కు క‌నీస ఆదాయం క‌ల్పిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల మానిఫెస్టోలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప‌థ‌కాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ రాజీవ్ కుమార్ త‌ప్పుప‌ట్టారు. ఆ ప‌థ‌కం ఆర్థిక విధానాల‌కు స‌రితూగ‌ద‌ని త‌న ట్విట్ట‌ర్‌లోనూ విమ‌ర్శించారు. అయితే ఓ రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించిన ప‌థ‌కంపై.. ప్ర‌భుత్వ అధికారి అయిన రాజీవ్ కుమార్ స్పందించ‌డాన్ని ఈసీ త‌ప్పుప‌ట్టింది. ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. త‌న వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాజీవ్ కుమార్‌కు ఈసీ నోటీసులు
జారీ చేసింది. దేశంలోని పేద‌ల్లో 20 శాతం మంది కుటుంబాల‌కు ప్ర‌తి ఏడాది 72 వేల ఆదాయం వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు చేపట్టనున్న‌ట్లు రాహుల్ గాంధీ త‌న పార్టీ మేనిఫెస్టోలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/