అప్పుడప్పుడు ఇలా తినండి

EATING
EATING

అప్పుడప్పుడు ఇలా తినండి

వంటింట్లోకి అడుగుపెట్టగానే భర్తకు ఏది ఇష్టం, పిల్లలు వేటిని చేస్తే ఇష్టంగా తింటారు అనే ధ్యాసతోనే స్త్రీల వంట సాగిపోతుంటుంది. వారానికి కనీసం ఒక్కరోజైనా నాకిష్టమైనది చేసుకుంటాను అనే భావన చాలామందిలో కలగదు. ఇంట్లోవారు తృప్తిగా తింటే చాలు అదే నాకు తృప్తి అనుకుంటూనే భర్త, పిల్లలకు ఇష్టమైనవే తల్లులు, భార్యలు ఇష్టంగా మార్చుకుని, రాజీపడి పండేస్తుంటారు. కానీ ఇది జీవితానికి ఆనందంగా అనిపించదు. కనీసం నెలకు ఒకసారైనా, లేదా వారానికి ఒకసారైనా మీకిష్టమైనవి వండుకుని చూడండి. మీ మనసు ఎంత సంతోషపడుతుందో మీరే గమనిస్తారు.

బీ వారానికి ఒకసారి మీకోసం ఏదైనా వండుకోండి. మీకు వంటరాకపోతే, నేర్చుకోండి. అది అన్నం, పప్పులాంటి మామూలు వంటైనా పరవాలేదు. అది మీకు వంటింటితో అనుబంధం కలిగిస్తుంది. మీమీద మీకు ప్రేమ, సానుభూతి ఉన్నాయని చెప్పటానికి అది ఒక భావన, అభివ్యక్తి. (ఆడవాళ్లూ, మీరు దయచేసి మీకిష్టమైనవి వండుకోండి,

మీ భర్తకో, పిల్లలకో, పక్కింటివాళ్లకో ఇష్టమైనవి కాదు) బీ మౌనంగా ఉండటం అభ్యసించండి. రోజూ ఒకే సమయానికి, ఒక గంటసేపో, కొన్ని నిమిషాలో, లేదా నెలకి ఒక రోజంతానో దానికి కేటాయించండి. అది వీలుకాని పక్షంలో కనీసం మాట్లాడదల్చుకున్న 3-4 వాక్యాలు వదిలెయ్యండి. (మామూలుగా అయితే మీరు వాటిని ఆపుకోలేరు) ముందుగా ప్లాన్‌ చేసుకుని దాన్ని అమలు చెయ్యం డి. మీరు అదుపులో ఉండగలరని మీ నాలుకకి తెలియాలి.

(మనం తినే ఆహారాన్ని అదుపు చేసే ముఖ్యమైన అవయవం కూడా నాలుకే. ఎవరు పెత్తనం చెయ్యగలరో మీరు నాలుకకి తెలియజేయాలి) బీ నెలకొకసారి ఉప్పు పూర్తిగా మానెయ్యండి. మరి నాలుగు సూత్రాలని పాటిస్తూ తినండి. కానీ ఉప్పు మాత్రం చేర్చకండి. (మర్నాడు పెద్ద విందు భోజనం ఉంది అన్నప్పుడు ఉప్పు మానేస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి) బీ మామూలుగా లేచే వేళకన్నా కొంచెం ముందు నిద్రలేవండి. అలాగే కాస్త ముందుగా నిద్రపోండి. దీన్ని ప్రారంభించటానికి 30నిమిషాల తేడా సరిపోతుంది. తినేప్పుడు బాసింపట్టు వేసుకుని కూర్చునేందుకు ప్రయత్నించండి. మలవిసర్జన సమయంలో గొంతుక్కూర్చోటం కూడా.