ఉద్యోగ సాధనకు సులభ మార్గాలు

Career--
Career–

మార్పు సహజం, అనివార్యం, రేపు ఎప్పటికీ నిన్నటిలాగా ఉండదు. జాబ్‌ మార్కెట్‌ కూడా అంతే. ఆటోమేషన్‌ మహిమతో రోజు రోజుకీ అప్‌డేట్‌ అవుతూనే ఉంది. కొత్త అభ్యర్ధులు కొలువు సాధిచుకోవాలంటే కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే, ఉద్యోగాల్లో ఉన్నవాళ్లూ దాన్ని కాపాడుకోవాలంటే స్కిల్స్‌ పెంచుకోవాల్సిందే. అందుకే కాలేజి రోజుల నుంచే రేపటి సవాళ్లకు దీటుగా సిద్ధం కావాలి. కొన్నేళ్ల క్రితం వరకూ ఉద్యోగం అంటే నిలకడగా, దీర్ఠకాలం ఒకేేచోట పనిచేయడం ప్రధాన లక్షణంగా ఉండేది.

విద్యా వ్యవస్ధ అందుకు తగిన విధంగానే విద్యార్ధులను తీర్చిదిద్దేది. అందుకు ఒక వ్యక్తి విద్యాభ్యాసం పూర్తవగానే ఏ సంస్థలో చేరతాడో దాదాపుగా అందులోనే పదవీ విరమణ చేయడం కనిపించేది. ఇంటర్నెట్‌ యుగప్రారంభ దశలో ఈ పరిస్థితుల్లో ఒకింత మార్పు వచ్చింది. జీవితాంతం ఒకేచోట పనిచేయడం అనే దృక్పథంలో మార్పులు మొదలయ్యాయి. అప్పట్లో అభ్యర్ధులు మొదటి ఉద్యోగా నికైనా అవసరమైన నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. సాధారణంగా ఉద్యోగం ఇచ్చిన సంస్థలే తగిన శిక్షణ ఇచ్చేవి, దీర్ఘకాలం తమతో ఉండే విధంగా చూసుకునేవి. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ చాలా మారిపోయింది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ వినని కొత్త జాబ్‌రోల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఇందుకు విభిన్న విషయాలపై అవగాహన అవసరం అవుతోంది. అలాగే తమ విభాగంతో ఏమాత్రం సంబంధం లేనివాటితోనూ కలిసి పనిచేయాల్సి వస్తోంది. సమీప భవిష్యత్తులో రోబోలతో పనిచేయడమూ తప్పనిసరి కానుంది. దీంతో అభ్యర్ధుల నుంచి సంస్థలు మరిన్ని నైపు ణ్యాలను ఆశిస్తున్నాయి. పైగా ఇప్పుడు ఫ్రీటాన్స్‌ సర్వీస్‌స్‌, తక్కువ వ్యవధిలో సేవలందించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సంస్థలూ ప్రతి చిన్నదానికి ఏళ్లపాటు జీతాలిచ్చే వారిని తీసు కోవడానికి సుముఖంగా లేవు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశమూ అభ్యర్ధికి విలువైనదే అవుతుంది.

భవిష్యత్తు స్పష్టంగా తెలియని స్టార్టఫ్‌, మార్కె ట్‌లో ఇప్పటికే బలంగా స్థిరపడిన సంస్ధ, ఇలా సంస్థ ఏదైనప్పటికీ నేరుగా సేవలు అందించేలా అభ్యర్ధి ఉండటం తప్పనిసరి అయింది. కాబట్టి ఉద్యోగ వేట ప్రారంభానికి ముందే భవిష్యత్‌ సవాళ్లకు సిద్దంగా ఉండాలి.

ఓపిక, సమయపాలన ముఖ్యం

ఉద్యోగ విషయంలో లైఫ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఎక్కవ. ఆటోవేషన్‌తో సంబంధం లేకుండా వీటికి ప్రాధాన్యం ఎక్కువ. మామూలుగా సంస్థ అన్నాక నలుగురితో పని చేయాల్సి వస్తుంది. భిన్నమైన మనస్తత్వాల వారితో కలిసి ప్రభావ వంతంగా పని చేయాల్సి ఉంటుంది. దీని అవసరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఓపిక, సమయపాలన, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వంటివి ఎన్నో అవసర మవుతాయి. వాటిని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఇదొక్కటే సరిపోవడం లేదు. ఇంకా కొన్ని జీవన నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జాబ్‌ రెడీనెస్‌కు ఎంత ప్రాధాన్యముందో తెలిపిందే,

కాబట్టి బృందంతో పనిచుయడంతో పాటు స్వీయ ప్రదర్శనకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందుకు అభ్యర్ధిలో స్వీయ నాయకత్వం, స్వతంత్ర లక్షణాలు అవసరమవుతున్నాయి. అంటే తనకుతానే బాస్‌, మార్కెటింగ ఆఫీసర్‌, టెక్నాలజీ ఆఫీసర్‌, అవసరాన్ని బట్టి తనకు తాను మారాలి.ఏదైనా పనిని చేయాల్సి వచ్చినపుడు తనకుతాను గడువు నిర్ణయించుకునే బాస్‌ లక్షణం, తన ఆలోచనను మార్కెటింగ్‌ చేసుకోగలగడం, భవిష్యత్‌కు తోడ్ప డుతుందనుకునే టెక్నాలజీలను ముందుగా నేర్చు కోవడం ఇలా తన భవి ష్యత్తును తాను నిర్మించుకునేలా తయారవ్వాలి. నేర్చుకోవడం, తనను తాను మలచుకోవడం లక్ష్య ంగా దిశగా నడిపించుకోవడం వంటివన్నీ అల వరచుకోవాలి. మొత్తంగా ఈ లైఫ్‌స్కిల్స్‌తో కళాశాల నుంచి బయటకు రాగలగాలి.

ప్రాక్టికల్‌ పరిజ్ఞాన0:

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటాం. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, వంటకాలు వంటి వాటి గురించి నెట్‌ సాయంతో వెతికేస్తాం. ఎక్కు వమంది సిఫారసు చేసినవాటికి ప్రాధాన్యమిస్తాం. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటాం. ఇదివరకు కొన్న వారి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలసుకుంటాం. నచ్చితే అప్పుడుకొంటాం. కదా! ఇదే పద్ధతి కెరియర్‌లోనూ ఉప యోగ పడుతుందని తెలుసా? పరీక్షలో పాస్‌ మార్కులు వచ్చినా, డాస్టింక్షన్‌ మార్కులు వచ్చినా పొందేది ఒకే డిగ్రీ, సబ్జెక్టుపై ఎంత పట్టు ఉందనేదే ముఖ్యం. పాస్‌ అయిన ప్రతి ఒక్కరి చేతిలో నూ డిగ్రీ ఉంటుంది. మార్కుల్లో తేడా కింత ప్రభావం చూపిఆ సబ్జెక్టుపై ఎంత అవగా హన ఉందనేదానికే తుది ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, మార్కులపై కాకుండా విషయం తెలిసి నవారిని ఎంచుకోవడానికి సంస్థలు సుముఖంగా ఉంటాయన్నది గుర్తించాలి. కేవలం చదవడానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా అది ఎంతవరకూ ఉపయోగపడుతుందన్న దాన్నిపై ఎక్కువ ఆసక్తి చూపాలి. పరీక్షలు నెగ్గటంపై కా కుండా నిజంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.

ఇలాంటివారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌. అప్రెంటిసష్‌ఆఫ్‌, ఆన్‌లైన్‌ ఉద్యోగాలు ఇలా ఎన్నో అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా ప్రతి రంగంలో ఈ అవకాశాలు అందు బాటులో ఉన్నాయి. వాటిని అందుకోగలగాలి.

ఇతర సబ్జెక్టులూ ముఖ్యమే:

ప్రతి రంగంలోనూ ఏటా ఎన్నో ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ సబ్జెక్టుల పరిజ్ఞ్ఞానంఉన్నపుడే ఇది ఎక్కువగా సాధ్యమవుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ మధ్య కాలంలో దీనికి సానుకూలంగా చాలామంది మాట్లాడుతున్నారు. విద్యార్ధలను ఆపరంగా నడిపేలా కృషి చేస్తున్నా రు. కూడా, ఇంటర్‌ డిసిప్లినరీ భావన దీనికి సంబ ంధించినతే, కాబట్టి కేవలం ఎంచుకున్న సబ్జెక్టుకే పరిమితం కాకుండా వేరే వాటికీ ప్రాధాన్యం ఇవ్వా లి.

ఉదాహరణ చెప్పాలంటే, జిపిఎస్‌, గూగుల్‌ మ్యాప్‌లు, జియో లోకేషన్లు, నూతన ప్రదేశాల, చిరునామాలు కనుక్కునే ప్రక్రియను సులభతరం చేస్తున్నాయని మనందరికీ తెలిసిందే, మేథమే టిక్స్‌, జాగ్రఫీల కలయికతో రూపొందింది.
నేర్చుకోవడానికి సంసిద్ధత: చదుదుకుంటున్నప్పుడే తమ రంగానికి సంబం ధించిన పరిశ్రమ, అందులో తరచుగా వస్తున్న మార్పులపై అధ్యయనం చేస్తుండాలి.

సంబంధిత రిపోర్టులు, వార్తలు, అధ్యయనాలు అన్నింటినీ అనేసరిస్తుండాలి.సంబంధిత టెక్నాల జీపైనా దృష్టిపెట్టాకోవాలి. వివిధ సంబంధిత టెక్నాల జీపైనా దృష్టిపెట్టాలి. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుండాలి.వాటిలో దీర్ఘకాల అవసరమున్న వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సంబం ధిత కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ సంస్థలు ఉచిత కోర్సులను అందిస్తున్నాయి.

వాటిని సంబంధిత రంగంలో పరిచయమున్న వారి సూచనలూ పనికి వస్తాయి.పద్ధతి ఏదైనా కావోచ్ఛు కానీ నేర్చుకో వడానికి మాత్రం ఎపుఫడూ సుము ఖంగా ఉండా లి. నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టే మార్గాన్ని ఎంచుకోవాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/