ఆచరణతోనే అభ్యసనం సులువు

Easy to learn with practice

పాఠశాల స్థాయిలోనే యువ మేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించి తద్వారా ప్రతి పాఠశాల నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన అవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనాఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న ప్రయో గశాలలు సంప్రదాయ పాఠ్యాంశా లకు అనుగుణంగా రూపొందించినవే కాని ప్రస్తుతం ఉన్న సాంకే తిక పరిజ్ఞానానికి అనుగుణంగా మాత్రం లేవ్ఞ. చాలా పాఠశాలల్లో ప్రయోగశాలలే లేవ్ఞ. ఇంటర్మీడియేట్‌ కళాశాలల్లో సైతం ప్రయోగ శాలలు లేకుండానే ప్రయోగ పరీక్షల్లో మార్కులు వేసి విద్యార్థుల్ని ఏమరుస్తున్నారు.

ప్రతి ఏడాది పబ్లిక్‌ పరీక్షల్లో ప్రయోగశాలల పరీక్షలు ఒకతంతుగా తయారయ్యాయి తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధి తో కార్యాచరణకు పూనుకోవడం లేదు.ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలను సమూలంగా మార్చి ఓ కొత్త వాతావరణాన్ని సృష్టిస్తే తప్ప విద్యార్థుల్లో ఆసక్తి పెరగదు. ప్రాథమిక ఎలక్ట్రానిక్స్‌ అంశాలు, రోబోటిక్స్‌, ఆధునికసైన్సు సాంకేతిక అంశాలు వంటి వాటికి చోటు కల్పించినట్లయితే విద్యార్థుల్లో ఉత్సాకత, జిజ్ఞాస, ఆలోచన ఊహాశక్తి పెంపొందుతాయి. దీనికి కేవలం వాగ్దానాలు కాకుండా కార్యసాధన నిర్ణయాలతో ముందుకుసాగాలి. సంప్రదా య తరగతిగదిలో బోధించే అంశాలకు దూరంగా విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడానికి ఈ ప్రయోగశాలలను రూపొం దించాల్సిన అవసరంఉంది.పాఠశాలల్లో ప్రారంభించే విజ్ఞానశాస్త్ర, సాంకేతిక, ప్రయోగశాలలు, విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉద్దీపనగా ఉపయోగపడతాయి.

ఈప్రయోగశాలలే, సృజనాత్మక సాంకేతిక వేదికలుగా మారుతాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్‌ టెక్నా లజీ ఆధారిత అభ్యాస వాతావరణం వల్ల విద్యార్థిలో ఏకాగ్రత పెరగటమేకాక ఊహాశక్తి పెంపొంది కొత్తకొత్త ప్రయోగాలు చేయా లనే ఉత్సూకత పెరిగి,స్వీయగమన అభ్యాసానికి అనుకూలమైన వాతావరణంలోకి అడుగుపెడతారు.విద్యార్థులందరూ ఒకే విధంగా వేగంతో అభ్యసించరు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా అభ్యసిస్తారు. సాంకేతిక ఆధారిత అభ్యాసన వల్ల తనకు నచ్చినవేగంతో ఎన్ని మార్లు ఆచరణలో పెట్టాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చు. కేవలం విద్యార్థులేకాక ఉపాధ్యాయులు కూడా విద్యార్థి మానసిక స్థితి, విశ్లేషణాసామర్థ్యం,విద్యార్థులు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారు,

వారి అవసరాలేమిటి వంటి అనేక అంశాలను సులువ్ఞగా అర్థం చేసుకోవడంవల్ల వారి విలువైన సమయం ఆదా అవ్ఞతుంది. ఇటీ వల కోల్‌కతాలో నిర్వహించిన ఐదోవ అంతర్జాతీయసైన్స్‌ పండు గలో యువమేధావ్ఞలు తమ ఆలోచనలను, సృజనాత్మకత ఆవిష్క రణలను ప్రదర్శించి అందరిని అబ్బురపరిచారు. ఈ సారి సైన్స్‌ పండుగలో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన చలనచిత్రాలు, ప్రదర్శ నలు, కథలు చెప్పడం వంటి నూతన అంశాలు ప్రవేశపెట్టారు. ఖగోళశాస్త్రపరిశోధన సోలార్‌ ప్రాంత సందర్శన, చంద్రయాన్‌ వంటి అనేక నూతన అంశాలను ప్రదర్శించారు.

చదువ్ఞ కేవలం జీవితంలో విజయం సాధించడానికి కాదు. జీవితంలో పరిపూర్ణత సాధించడానికి ఏ స్థాయిలోనైనా పాఠ్యాంశాలు విద్యార్థి కేంద్రంగా సాగి అతనికి సంపూర్ణ సంతృప్తిని కలిగించాలి. విద్యార్థుల మాన సిక, భౌతిక, ఆరోగ్యసామాజిక అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వారి భావోద్వేగాలు, సాకారాత్మక నడవడికకు అవసరమైన పాఠ్యాంశా లను రూపొందించాల్సిన అవసరం ఉంది.విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిపై ఎటువంటి ఒత్తిడిలేని, సున్నితమైన సంరక్షణతో కూడిన విద్యను రూపొందించాలి. ప్రశ్నించే తత్వం, ప్రతిఅంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం,సృజనాత్మక, ఊహాత్మక భావస్వేచ్ఛ వంటి వాటికి పెద్దపీట వేయాలి.

విద్యార్థులు తమ లక్ష్యాలు చేరుకోడానికి, సరైన మార్గంలో ప్రయాణించడానికి మేధో పరమైన సంభావితమైన అభివృద్ధికి విద్యాసంస్థలు చోదకశక్తులుగా ఉపయోగపడాలి.ఉపాధ్యాయులు కూడా నిరంతరం కొత్త విషయా లు నేర్చుకుంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుంది. విద్యార్థులు రకరకాలుగా విద్యను నేర్చుకుంటారు. ఎవరికి కావలసిన రీతిలో వారికి బోధించడం ఉపాధ్యాయులవిధి. అందుకే ఆ భాసకులకు అభ్యాసన ఎంతో ముఖ్యమైనది. మన శాస్త్రసాంకేతిక పాఠాలన్నీ పాతచింతకాయ పచ్చడి లాంటివే. ఆధునిక యుగంలో చోటు చేసుకుంటాయి. సాంకేతిక అభివృద్ధిని ఏమాత్రం పాఠ్యాంశాలలో జోడించలేదు. కొత్త పాఠాలు చేరిస్తే వాటిని ముందుగా ఉపాధ్యా యులు నేర్చుకోవాలి. అందుకని వాటిని సిలబస్‌లో చేర్చడానికి వీరు ముందుకురారు. కాని విద్యార్థులు మాత్రం వీరి ఆలోచనా పరిధిని దాటిపోతున్నారనే సంగతి గ్రహించడం లేదు.

ఆధునిక, శాస్త్రసాంకేతిక విద్యను విద్యార్థులకు అందించినప్పుడే దేశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుంది.చిన్నవయస్సు నుండే పిల్లలకు శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు అలవడటానికి కావల సిన ప్రాథమిక అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాలి. దీనితో మూఢ నమ్మకాలు, మూర్ఖవిశ్వాసాలకు దూరంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అంతేకాకుండా కళాశాల స్థాయికొచ్చే సరికి విద్యార్థులు సొంత సాంకేతిక అంశాలను రూపొందించే సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకుంటారు. పాఠశాలలో ప్రప్రథమంగా పరిసరాల విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పాలి. తమచుట్టూ జరుగు తున్న భౌతిక రసాయనిక,వృక్ష విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించా లి. దీనివల్ల విద్యార్థులకు సమాజంపై అవగాహన, బాధ్యత పెరు గుతుంది.

కేవలం అంకెలు, ముక్కలు ముక్కలుగా సమాచారాన్ని బట్టీపట్టించే బదులు సంభావిత అవగాహన కార్యసాధన నిర్వహణ ద్వారా విద్యార్థులలో విజ్ఞానశాస్త్రం పట్ల సరైన దృక్పథాన్ని అల వరుచుకోవడానికి గట్టిపునాదులు ఏర్పాటుచేయాలి. 21వ శతాబ్దం లో ఇ-మెయిళ్లు, అంతర్జాలం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, సామాజిక మీడియా ద్వారా సమాచారం అందుబాటులోకొస్తుంటే ఇంకా సం ప్రదాయ పద్ధతిలో బోధించడంవల్ల విద్యార్థుల్లో ఏమాత్రం ఉత్సా హంరేకెత్తదు.’ఆచరణతోనే అభ్యాసనపద్ధతిలో విద్యార్థులకు బోధిం చడంవల్ల గణనీయమైన ఫలితాలు సాధించవచ్చు. విజ్ఞానశాస్త్రాలు బోధించేటప్పుడు కూడా అన్వేషణా విధానంతో బోధిస్తే విద్యా ర్థులు మరింతఉత్సూకతతో నేర్చుకోటానికి ముందుకొస్తారు.ప్రయో గాలు, ప్రశ్నించడం ద్వారానే ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.

శాస్త్రీయ అంశాలను ఆచరణలో పెట్ట డం ద్వారా ప్రయోగాలు, పరిశీలనలతో విశ్లేషణలతో నూతన ఆవిష్కరణలను సాధించగలరు విద్యార్థులు. పరిశీలన అనేది విద్యార్థి దశలో చాలా ముఖ్యమైన అంశం. సామాన్య ప్రజలు పరి శీలించే విధానం వేరు. శాస్త్రీయ దృక్పథంలో లోతుగా పరిశీలించే విధానం వేరు. లోతైన పరిశీలన విద్యార్థుల మేధోశక్తిని పెంపొంది స్తుంది. ప్రయోగమే ఖచ్చితత్వానికి మాతృక, ప్రయోగం నుండి వెలువడని విజ్ఞానశాస్త్రం కేవలం తప్పుల తడక మాత్రమే. మనదేశంలో ముఖ్యంగా మనరాష్ట్రంలో పాఠశాలల్లో ప్రయోగశాల లు దాదాపుగా లేవనే చెప్పాలి.

ఒకవేళ ఉన్నా పురాతన కాలం నాటి ప్రయోగపరికరాలు, విరిగిన బల్లలు, బూజుపట్టిన గదులతో విద్యార్థులు అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నా యి.దాతలు, కార్పొరేటు కంపెనీల సహాయంతో ప్రయోగశాలలను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్స్‌, ఫిజిక్సు,కెమిస్ట్రీ,జీవశాస్త్రం వంటి వివిధఅంశాలలో జరిపే ప్రయో గాలతో విద్యార్థులకు సహజసిద్ధమైన పరిణామాల్ని పరిశీలించడాని కి అవకాశాలు ఏర్పడుతుంది.

విద్యుత్‌,నీరు,ఆయస్కాంతం, నిప్పు, వెలుతురు వంటి వాటిపై ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోదొరికే వస్తువ్ఞలతో నిర్వర్తించవచ్చు. ఉపాధ్యాయులు కూడా కేవలం ప్రభుత్వం నుండి నిధులు సమాకూర్చడం లేదని తిట్టు కుంటూ కూర్చోకుండా చిన్నచిన్న ప్రయోగాలను స్థానిక వనరులతో రూపొందించి ప్రయోగశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.పైన చర్చించిన అంశాలన్నీ ఆచరణలోకి రావాలంటే నిబద్ధతతో, నిజాయితీతో వృత్తిపట్ల మమకారంతో పనిచేసే అర్హతగల, విలువలకు కట్టుబడే ఉపాధ్యాయులు కావాలి.

  • ఈదర శ్రీనివాసరెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/