సులువుగా చేయగలిగిన ఆసనాలు

యోగాసాధన

Asanas
Asanas

సులువుగా చేసుకునే చిన్న చిన్న యోగాసనాల వల్ల మంచి ఫలితాలుంటాయి. భుజాలు, చేతులు, మెడ నరాలు, తుంటి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వీపు కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. గోముఖాసనం : సుఖాసనంలో కూర్చుని ఎడమపాదం కుడి వైపున కింద ఉంచాలి. కుడి మోకాలు ఎడమ మోకాలిపై పెట్లాలి. కుడి చేతిని కుడి భుజంపై నుంచి వెనక్కి తీసుకెళ్లాలి.

ఎడమ చేయిని పక్క నుంచి వెనక్కి మడవాలి. వెనకాల రెండు చేతి వేళ్లను ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి.

దీర్ఘశ్వాస తీసుకుంటూ వదులుతూ, సాధ్యమైనంత సేపు అదే భంగిమలో ఉండాలి. తరువాత కాలు మార్చుతూ అలా అయిదుసార్లు చేయాలి.

హిప్‌ట్విస్ట్‌:

కూర్చుని కాళ్లు చాపాలి. ఇప్పుడు ఎడమ కాలిని పూర్తిగా మడవాలి. కుడి పాదాన్ని ఎడమ తొడపై నుంచి నేలపై పెట్టాలి. వెన్నెముక, తల నిటారుగా ఉంచి, శ్వాస తీసుకోవాలి. ఇదే విధంగా కాళ్లు మార్చి చేయాలి. ఇలా అయిదు సార్లు ప్రయత్నించాలి.

మార్జాల ఆసనం:

మోకాళ్లు, అరచేతులను నేలపై ఉంచాలి. అంటే నాలుగు కాళ్లపై నిలబడినట్లు అన్నమాట. శ్వాస తీసుకుంటూ నడుముపై ఒత్తిడి తెస్తూ, కిందకు నెట్టాలి.

భుజాలు వెనక్కి పెట్టాలి. తల పూర్తిగా పైకి లేపాలి. తరువాత శ్వాస వదులుతూ నడుమును పైకి ఎత్తాలి. తల కిందకు తీసుకుని వెన్నెముక వంగేలా ఉంచాలి.

పొట్ట కండరాలు బిగించాలి. ఇలా చేయగలిగినన్ని సార్లు చేయవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/