తూర్పు గోదావరిలో మహిళపై అత్యాచారం.. హత్య

Rape and murder of women
Rape and murder of women

తూర్పు గోదావరి: ఐ.పోలవరం మండలం తూర్పు గోదావరి జిల్లాలో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. జి.వేమవరంకు చెందిన 50 ఏళ్ల మహిళపై కొందరు మృగాలు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమె అత్యంత పాశవికంగా హత్య కూడా చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల కలిసి ఈ దారుణం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఇప్పటికే అందులో ఒకరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరివురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్‌ శివారులో దిశ హత్యోదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అటువంటిదే మరో ఘటన జరగడం అందరినీ తీవ్ర దిగ్బాంత్రికి గురి చేస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/