ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద భూకంపం

టెహ్రాన్ : ఇరాన్లో అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలో భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. దేశంలోని ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బుషెర్కు 45 కిలోమీటర్ల దూరం, 38 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం దృష్ట్యా కొన్ని పర్వత ప్రాంతాల్లోని రహదారులను మూసివేశారు. 2017 నవంబర్‌లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 620 మంది మృతి చెంచారు. 2003లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 31వేల మంది, 1990 లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 40వేల మంది మరణించారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/