సంగారెడ్డిలో భూకంపం..

Earthquake in Sangareddy..Community-verified icon


సంగారెడ్డిలో భూకంపం చోటుచేసుకుంది. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడి ఇళ్లలో నుండి బయటకు పరుగులు పెట్టారు.

అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది.

అసలు భూకంపం రావడానికి కారణాలు చూస్తే..పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, అలాగే చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రిజర్వాయర్లలో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భూప్రకంపనల తీవ్రతను బట్టి నష్టం వాటిల్లులుంది.