పాకిస్థాన్‌లో స్వల్ప భూకంపం

Richter scale graph
Earthquake

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో బుధవారం ఉదయం 11.25 గంటలకు భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.7గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

క్రొయేషియాలో నిన్న భారీ భూకంపం వచ్చింది. దేశ రాజధాని జాగ్రెబ్‌కు ఆగ్నేయంగా 30 మైళ్ల దూరంలో స్థానిక సమయం మధ్యాహ్నం తర్వాత ప్రకంపనలు వచ్చాయి. 6.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. కనీసం ఏడుగురు మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారని అధికారులు తెలిపారు. అలాగేపెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మిలిటరీ సహాయంతో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ప్రధాని ఆండ్రేజ్‌ ప్లెన్‌కోవిక్‌ వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/