ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు

ఒంగోలు సహ కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు

Richter scale graph
Earthquake

ఒంగోలు: ఈరోజు ఉదయం 10.15 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. నగరంలోని శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ పరిసరాల్లో స్వల్ప భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఒంగోలు సహా కర్ణాటక, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఝార్ఖండ్‌లో రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.7గా నమోదయిందని అధికారులు మీడియాకు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4గా నమోదయిందని అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/