నేపాల్‌లో భూకంపం

జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం

Richter scale graph
Earthquake

నేపాల్‌: నేపాల్‌లో గత అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. కాగా డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. భూకంప ప్రభావంతో ఖఠ్మాండూ, కాస్కీ, పర్సా, సింధుపల్‌‌చోక్ తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా ఎవరూ గాయపడినట్టు కానీ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు. కాగా మంగళవారం అర్ధ రాత్రి సరిగ్గా 11:53 గంటలకు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/