మహారాష్ట్రాలో వరుస భూకంపాలు

12 నిమిషాల్లో 4 భూకంపాలు

Earthquake
Earthquake

ముంబయి: మహారాష్ట్రాలోని పాల్ఘర్‌ జిల్లాలో నిన్న రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. అర్ధరాత్రి సమయంలో కేవలం 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. తొలుత అర్ధరాత్రి 1.03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. ఆ తర్వాత 1.15 గంటల వరకు 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడు సార్లు భూమి కంపించింది.కాగా, భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/