ఇరాన్‌లో భూకంపం..ఒకరి మృతి

రిక్టర్ స్కేలుపై 5.1గా తీవ్రత నమోదు

Richter scale graph
Earthquake

ఇరాన్‌: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్టు ఆ దేశ వైద్య శాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహాన్‌పూర్ తెలిపారు. టెహ్రాన్‌కు ఈశాన్యంగా దమావాండ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/