క్రొయేషియాలో భూకంపం

భారీగా కూలిన భవనాలు..పలువురికి గాయాలు

earthquake-croatia
earthquake-croatia

జాగ్రెబ్‌: క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలు కాగా, అధికారులు, సహాయక సిబ్బంది వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా జాగ్రెబ్ లో లాక్ డౌన్ ను ప్రకటించగా, తాజాగా వచ్చిన భూకంపంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టంపై సమాచారం అందాల్సివుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/