అసోంలో భూకంపం

గంట వ్యవధిలో మూడుసార్లు భూ ప్రకంపనలు

Earthquake in Assam
Earthquake in Assam

Assam: అసోంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటల సమయంలో సోనిత్‌పూర్‌లో 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. .రెండో సారి మళ్ళీ 8.13 గంటలకు.. 8.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళన తో ఇళ్ల పరుగులు పెట్టారు. ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలిసింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తమకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/