ముంబయిలో స్వల్ప భూకంపం

Richter scale graph
Earthquake

ముంబయి: వరుస భూకంపాలతో ముంబయి వణికిపోతుంది.గ‌త‌ శుక్ర‌, శ‌నివారాల్లో ఉత్త‌ర‌ ముంబయిలో భూమి కంపించింది. తాజాగా ఈరోజు ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌రోసారి స్వ‌ల్పంగా భూకంపం వ‌చ్చింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.5గా న‌మోద‌య్యింది. ముంబైకి ఉత్త‌రాన 102 కి.మీ. దూరంలో భూమి కంపించింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలిపింది. కాగా శ‌నివారం ఉద‌యం 6.36 గంట‌ల‌కు 2.7 తీవ్ర‌త‌తో ‚ముంబయికి ఉత్త‌రంగా భూమి కంపించింది. అంద‌కు ముందురోజు శుక్ర‌వారం ఉద‌యం 10.33 గంట‌ల‌కు 2.8 తీవ్ర‌త‌తో భూమి కంపించ‌గా, అదేరోజు 11.41 గంట‌ల‌కు నాసిక్‌లో 4.0 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/