రుణమాఫీ ఫైలుపై తొలిసంతకం : కమల్‌నాథ్

Chief Minister of Madhya Pradesh  kamalnath
Chief Minister of Madhya Pradesh kamalnath
మధ్య ప్రదేశ్:  మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్… రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే రుణమాఫీ ఫైలుపై తొలిసంతకం చేశారు. 2018 మార్చి 31కి ముందు రైతులు రూ.2 లక్షల వరకు జాతీయ, కోఆపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది రైతు రుణమాఫీనే కావడం గమనార్హం. తాము అధికారంలోకి వస్తే పదిరోజుల్లోగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అధికారం చేపట్టిన వెంటనే ఈ హామీపై సీఎం కమల్‌నాథ్ వేగంగా స్పందించినట్టు కనిపిస్తోంది.