పండగసీజన్‌లో ‘ఇ-కామర్స్‌ఎఫెక్ట్‌

రిటైల్‌ వర్తకులకు కళతప్పిన దీపావళి

Diwali
Diwali

న్యూఢిల్లీ: ఇ-కామర్స్‌ పండగసేల్స్‌పేరిటిస్తున్న భారీ డిస్కౌంట్లతో సాంప్రదాయంగా వస్తున్న స్టోర్లలోఅమ్మకాలమాంద్యం నెలకొనడంతో ఈ దీపావళికి తమతమ షాపులకు ఎలాంటి అలంకరణలుచేసుకోలేనిపరిస్థితుల్లో రిటైలర్లుఉన్నారు. దీపావళి మందుగుండు సామగ్రి వ్యాపారాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఇకామర్స్‌ సంస్థలు ఇస్తున్నఅనుచిత డిస్కౌంట్లపైచర్యలు తీసుకోనందుకు నిరసనగా ఈ విధానం అవలంభిస్తున్నట్లు అఖిలభారత వర్తకసంఘాల సమాఖ్య (కైయిట్‌) వెల్లడించింది. ప్రస్తుతం వర్తకరంగంలో అనుచిత విధానాలు ఎక్కువ అమలవుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. దేశంలోనే దీపావళి అంటే అతిపెద్ద పండుగగా భావిసతఆరు. మొత్తం బిజినెస్‌లలో 30శాతం వ్యాపార కేవలం ఈ పండుగసీజన్‌లోనే పూర్తి అవుతుంది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. ఇక దీపావళి కేవలం వారంరోజులు కూడా లేనితరుణంలోవాణిజ్యమార్కెట్లు మాంద్యంలోనికి వెళ్లిపోయాయయని. ఇకమార్స్‌ సైట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటివి సుమారు19వేల కోట్ల విలువైన ఉత్పత్తులను కేవలం నాలుగురోజుల్లోనే విక్రయించాయి. కైయిట్‌ అధ్యక్షుడు బిసి భర్తియా మాట్లాడుతూ భారత్‌లోని రిటైల్‌ట్రేడ్‌ సుమారు 45 లక్షలకోట్ల వ్యాపారటర్నోవర్‌తో ఉంటుందని, వీటిలోమొత్తం ఆరులక్షలకోట్ల విలువైన అమ్మకాలు కేవలం దీపావళి సీజన్‌లోనే జరుగుతాయని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/