కౌన్‌బనేగా కరోడ్‌పతిలో ద్యుతీ చంద్‌ కన్నీరు

Dutee Chand
Dutee Chand

ముంబయి: పూరి గుడిసెలో పుట్టి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన క్రీడాకారురాలు భారత స్ప్రింటర్‌ ద్యతీ చంద్‌. కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రత్యేక ఎపిసోడ్‌లో భాగంగా ద్యుతీచంద్‌, క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హిమా దాస్‌లు పాల్గొన్నారు. ఈ ప్రఖ్యాత షోకి బిగ్‌బి అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో బిగ్‌బి ద్యుతీని తన జీవిత ప్రయాణం గురించి చెప్పమనగా తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురైంది. అప్పట్లో తన ఇంట్లో పరిస్థితుల కారణంగా ఆడాలని ఉన్నా పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఒక పూట తింటే మూడు రోజుల వరకూ తిండి ఉండేది కాదని ఆమె చెప్పుకొచ్చారు. తన ఇంటి పక్కన ఉన్న కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారులు పడబోసిన కూరగాయలను తెచ్చుకుని రోజులు గడిపేవారని చెప్పి కంటనీరు చిందించింది. బిగ్‌బి సహా అక్కడున్న వాళ్లంతా కళ్లు చెమర్చారు. అక్కడున్న వారందరినీ ద్యుతీకి గౌరవ సూచకంగా లేచి నిలబడాలని బిగ్‌బి అమితాబ్‌ చెప్పారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/