అక్టోబర్ 3 నుంచి 9 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

ప్రకటన జారీ చేసిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీః దసరా సందర్భంగా సుప్రీంకోర్టుకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 3 నుంచి మొదలు కానున్న ఈ సెలవులు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దసరా సెలవులను ముగించుకుని సుప్రీంకోర్టు తిరిగి అక్టోబర్ 10 నుంచి యథాతథంగా పనిచేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దసరా సెలవులకు సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/