నేటి నుంచి ఏపీ, తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు


తెలంగాణలో మాత్రం అక్టోబరు 13 వరకు సెలవులు
ఏపీలో వచ్చే నెల 10న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు

Schools holidays for Dasara
Schools holidays for Dasara

హైదరాబాద్‌: ఏపి తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. ఏపి నేటి నుంచి వచ్చే నెల 9వ వరకు సెలవులు ప్రకటించగా 10న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు పాఠశాలలకు మాత్రమే. ఇక, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అక్టోబరు 6 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించింది. తెలంగాణలోనూ నేటి నుంచి ప్రారంభం కానున్న సెలవులు వచ్చే నెల 13 వరకు కొనసాగనున్నాయి. 14న తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/