అంగన్‌వాడీ, టీచర్లు, హెల్పర్లకు దసరా కానుక

anganwadi center
anganwadi center

హైదరాబాద్: అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కోసం ముందే వేతనాలు విడుదల చేసింది. ఈ మేరకు రూ.83 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం సిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండగ మొదటి వారంలోనే వస్తుంది. దీంతో వేతనాలు లేకపోవడంతో పండగ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ ఉపాధ్యా యులు, ఆయాల సంఘం నేతలు మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి పండగ కోసం వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సిఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సిఎం పండగ కోసం అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

దీంతో ఈ నెల 1వ తేదీ రాత్రి అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.83 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ అంగన్ వాడీల ఉద్యోగుల కోసం అడగ్గానే నిధులిచ్చిన సిఎం కెసిఆర్ మొదటి నుంచి అంగన్ వాడీ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/