దేవీ ఆవిర్భావ విశేషం

Kanaka Durga

ప్రథమా శైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణి
తృతీయా చంద్రఘంటితి, కుష్మాండేతి చతుర్థికీ
పంచమా
స్కందమాతేతి షష్ఠా కాత్యాయనేతి
చ సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి బైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్‌ నవదుర్గా ప్రకర్తితా
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదలయ్యే దేవీ నవరాత్రులు విజయదశమితో ముగుస్తాయి. గౌరి, సరస్వతి, మహాలక్ష్మి, అవతార స్వరూపాలతో ముగురమ్మలుగా జగన్మాత కొలువదీరి, రోజుకో అలంకారం, పిండివంటలతో అర్పింపబడి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చి అనుగ్రహిస్తుంది లోకపావని.
దేవీ ఆవిర్భావ విశేషం
పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవ్ఞని కోరికపై మహామాయ విష్ణువ్ఞను నిద్రలేపింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువ్ఞ, మధుకైటభులతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతవరకు తమతో పోరాడినందున శ్రీమహావిష్ణువ్ఞను నీకు ఏ వరం కావాలి? అని ప్రశ్నిస్తారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు.

దానితో వారు తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకుని తమను నీరులేని ప్రాంతానికి పంపమని కోరతారు. శ్రీహరి వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంచరించు సమయంలో మహామాయ పది తలలతో, పది కాళ్లతో, నల్లని రూవ్ఞతో మహంకాళిగా ఆవిర్భవించి శ్రీమహావిస్ణువ్ఞనకు సహాయపడుతుంది. సింహ వాహినిగా మహిషాసురుని, మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండిగా పేరు తెచ్చుకుంది. నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. రక్తదంతిగా రాక్షసుని సంహరించి, శాకంబరిగా శాకాలు, ఫలాలను ఇచ్చి కరువ్ఞ కాటకాల నుంచి లోకాన్ని ఆదుకుంది. దురుడనే రాక్షసుని సంహరించి దుర్గగా, మాతంగిగా రూపుదాల్చి తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని తుమ్మెదల సాయంతో హతమార్చి భ్రామరిగా పేరు తెచ్చుకుంది. లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. విజయదశమి రోజున శ్రవణా నక్షత్రం ఉంటుంది.

నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో ఉంచుతారు. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువ్ఞ పెట్టడం ఆచారం. అలాగే, దసరా రోజున పనిముట్లకు, వాహనాలకు ఆయుధపూజ నిర్వహిస్తారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ విజయదశమి. విజయవాడ, ఉజ్జయిని, కోల్‌కత్తా, మైసూరుల్లో విజయదశమిని చాలా వైభవోపేతంగా నిర్వహిస్తారు.

  • డేగల అనితాసూరి

తాజా మొగ్గ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/