ఎత్తిపోతలకు దుమ్ముగూడెం అనువైనది!

ట్రిబ్యునళ్లు ఏర్పాటు అవసరం!

y s jagan mohan reddy
y s jagan mohan reddy, ap cm

అమరావతి: గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించే ప్రణాళికలపై ఏపి జలవనరుల శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల ఇరు రాష్ట్రాల సియంల సమావేశంలో తెలంగాణ సియం కేసిఆర్‌ చేసిన ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తున్నారు. గోదావరి జలాలను కృష్టా నదిలోకి ఎత్తిపోసేందుకు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి..అక్కడి నుంచి టన్నెళ్లు, లిఫ్టులతో నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాలను గోదావరి జలాలను తరలిస్తే ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉభయ రాష్ట్రాలు కలసికట్టుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో నీటి పంపకాలు కొనసాగిస్తే..ట్రిబ్యునళ్ల గొడవ ఉండదని కేసిఆర్‌ వ్యాఖ్యానించారు. జల వివాదాలు తలెత్తినపుడు తప్పనిసరిగా ట్రిబ్యునళ్లను ఆశ్రయించాల్సిందేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సియంల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని, భవిష్యత్‌లో తేడా వచ్చినా, ప్రభుత్వాలు మారినా జలాల పంపిణీపై తగాదా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/