దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

మెదక్ పోలీసులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేసారు. దుబ్బాక నియోజకవర్గానికి వెళ్తోన్న రఘునందన్ రావును తూప్రాన్ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. తన నియోజక వర్గానికి వెళుతుంటే.. అన్యాయంగా పోలీసులు అరెస్ట్‌ చేశారని ఈ సందర్భంగా రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇక బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిరసనలు జరపాలని బిజెపి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి నిరసనలు , ధర్నలు , దీక్షలు చేయకూడదని..ఆలా చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావును అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అలాగే ఈరోజు స్యాన్తరం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అద్వర్యం లో భారీ ర్యాలీ జరపాలని బిజెపి ప్లాన్ చేసింది. కానీ పోలీసులు మాత్రం జేపీ న‌డ్డా ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. కోవిడ్ నిబంధ‌న‌లను అంద‌రూ పాటించాల్సిందేన‌ని అన్నారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింద‌ని తెలిపారు. ఆ ఆంక్ష‌ల లో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి సంద‌ర్భాల‌లో ర్యాలీల‌కు, ధ‌ర్నాల‌కు, బ‌హిరంగ స‌భ లకు అనుమ‌తి లేద‌ని తెల్చి చెప్పారు.