జమ్మూకశ్మీర్‌లో మ‌రోసారి డ్రోన్ల క‌ల‌క‌లం

నాలుగు రోజుల నుంచి మిల‌ట‌రీ క్యాంపుల ప‌రిస‌రాల్లో ఏడు డ్రోన్ల‌

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ మ‌రోసారి డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. బుధ‌వారం రోజు మూడు ప్ర‌దేశాల్లో డ్రోన్లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. దీంతో బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. డ్రోన్ల‌ను మిరాన్ సాహిబ్, క‌లుచాక్, కుంజ్వాని ఏరియాల్లో గుర్తించిన‌ట్లు తెలిపారు. గ‌త నాలుగు రోజుల నుంచి మిల‌ట‌రీ క్యాంపుల ప‌రిస‌రాల్లో ఏడు డ్రోన్ల‌ను గుర్తించిన‌ట్లు భ‌ద‌త్రా బ‌ల‌గాలు పేర్కొన్నాయి. డ్రోన్లు తిరుగుతున్న‌ ప్రాంతాల్లో  సైన్యం సెర్చ్‌ ఆప‌రేష‌న్ చేప‌డుతోంది. దేశ భద్రతకు డ్రోన్ల వ‌ల్ల‌ ఏర్పడే కొత్త సవాళ్లను తిప్పికొట్టేందుకు సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని భార‌త ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంది.

జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/