ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు సజీవదహనం

fire accident
fire accident

గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 26వ నెంబరు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖ నుంచి పార్వతీపురంవైపు కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కెమికల్‌ లారీలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌ రామచందర్‌యాదవ్‌ (40), క్లీనర్‌ ప్రకాష్‌ సింగ్‌(30) మంటల్లో సజీవదహనమయ్యారు. దీంతో తెల్లవారుజాము 3గంటల నుంచి 6గంటల వరకు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆగి ఉన్న లారీ కూడా అంతకుముందే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/