వేడికి నీళ్లే ఆరోగ్యం

వేడికి నీళ్లే ఆరోగ్యం
Drinking Water


మనలో చాలామందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే ఉంది. మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్‌ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్‌ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ రకరకాల తలనెప్పులు, కీళ్లనెప్పులు, కండరాల నెప్పులు ప్రారంభం అవ్ఞతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు త్రాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి క్వార్టర్‌ లీటర్‌ నీరు విధిగా తాగాలి. విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావ్ఞలీటరు నీరు తప్పక తాగాలి. మంచినీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురై అదే సమయంలో మెటబాలిజం రేటే మూడు శాతం వరకూ తగ్గిపోతుంది. మంచినీరు శరీరానికి అందకపోతే మీరు నీరసించిపోతారు. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి. షార్ట్‌టర్మ్‌ మెమరీ దెబ్బతింటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు.