కరోనా వదంతులపై డబ్ల్యూహెచ్‌ఓ వివరణ

ఆల్కాహాల్, క్లోరిన్ ఒంటికి పూసుకుంటే వైరస్ రాదంటూ వదంతులు

Drinking alcohol will not protect you from Covid-19, says WHO
Drinking alcohol will not protect you from Covid-19, says WHO

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజు రోజుకు మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీతో ఈవైరస్‌పై కొత్త వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆల్కాహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కాహాల్ నుగానీ, క్లోరిన్ ను గానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సోమవారం ప్రకటన జారీ చేసింది. ఆయా వదంతులు ప్రచారాలపై వివరణ ఇచ్చింది.


•ఆల్కాహాల్ తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది వాస్తవమే. అయితే మనం ఆల్కాహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మక్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది.

•ఇక శరీరంపై ఆల్కాహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందని, అంతే తప్ప అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది.

•ఆల్కాహాల్ ఉండే హ్యాండ్ రబ్ లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది.

•ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/english-news/