విశాఖలో అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు స్వాధీనం

వీటి విలువ సుమారు రూ.84 లక్షలు

DRI (Directorate of Revenue Intelligence) seizes smuggled gold in Visakhapatnam

Visakhapatnam: అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును డిఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ) విశాఖపట్నం రీజినల్ యూనిట్ స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 0.84 కోట్లు ఉంటుందని తెలిసింది. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా, విశాఖపట్నం ప్రాంతీయ యూనిట్‌కు చెందిన డిఆర్ఐ అధికారులు ఈనెల 5వ తేదీన విశాఖలోని నగల దుకాణం ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 4 బంగారు బిస్కెట్లను విదేశీ గుర్తులతో (వల్కంబి-సూయిస్) స్వాధీనం చేసుకున్నారు. వీటి వీలుగా విలువ రూ. 62,71,000/-, ఇది అక్రమ బంగారాన్ని అమ్మిన ఆదాయం. అక్రమంగా తరలిస్తున్న 400 గ్రాముల బంగారు బిస్కెట్ల విలువ రూ. 21,20,000/- మరియు నగదు రూ. 62,71,000/- స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ చట్టం ప్రకారం ఈనెల 6వ తేదీన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/