జోరు వానలోనూ రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ..ప్రస్తుతం భారత్ జోడి యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. మైసూరులో పాదయాత్ర సాగించిన రాహుల్ .. ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ రాహుల్ తన ప్రసంగాన్ని ఏమాత్రం ఆపకుండా వర్షంలోనే కొనసాగించారు. దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ‘భారత్‌ జోడో యాత్ర’నూ ఎవరూ ఆపలేరు’ అని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వాళ్లకు కష్టమని విమర్శించారు.

ఇక తెలంగాణ లో రాహుల్ పాదయాత్ర అక్టోబర్ 24 నుండి మొదలుకాబోతుంది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 13 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో మొత్తం 359 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 13 రోజులపాటు రోజు వారీగా రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే నియోజకవర్గాల జాబితాను కూడా టీపిపిసి సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలో కి ఎంట్రీ ఇవ్వనుంది.