ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Akash-1S to Air missile
Akash-1S to Air missile

హైదరాబాద్‌: ఆకాశ్‌-1ఎస్‌ మిస్సైల్‌ను బీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సోమవారం విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని బాలసోర్‌లో జరిగింది. అయితే ఆకాశ్‌-1 ఎస్‌ మిస్సెల్‌ వర్షెన్‌లో కొత్త రకానికి చెందినంది. భూత‌లం నుంచి ఉప‌రిత‌లం మిస్సైల్‌గా దీన్ని ప‌రీక్షించారు. ఆకాశ్ 1ఎస్ క్షిప‌ణితో ఫైట‌ర్ జెట్స్‌ను టార్గెట్ చేయ‌డం సులువు అవుతుంది. క్రూయిజ్ మిస్సైళ్లు, ఎయిర్ టు స‌ర్ఫేస్‌, బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను కూడా ఆకాశ్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు. శ‌త్రువుల‌కు చెందిన డ్రోన్ల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా కూల్చ‌గ‌ల‌దు. శ‌త్రు మిస్సైళ్ల‌ను ఇది సుమారు 18 నుంచి 30 కిలోమీట‌ర్ల దూరం నుంచి ప‌సిక‌ట్టి నేల‌కూల్చ‌గ‌ల‌దు. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. కాగా ఈక్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇది రెండోవసారి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:. https://www.vaartha.com/news/national/