డీఆర్‌డీవో యుద్ధ ఔషధాల కిట్‌

Terriost Attack
Terriost Attack

న్యూఢిల్లీ: పోరాటాల్లో తీవ్రకమై గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతను అనుభవించి సైనికులు మరణిస్తుంటారు. అయితే ఈ గాయాలకు తక్షణం చికిత్స అందించగలిగితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకోసం డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఓ కిట్‌ను సిద్ధం చేసింది. ప్రాణాలతో పోరాడే సైనికులను కాపాడేలా దీన్ని రూపొందించారు.

దీనిలో ఉండేవి ఇవే..
తీవ్ర రక్తస్రావం అవుతున్న గాయాలను మూసివేసే ఔషధాలు, గాయానికి డ్రెస్సింగ్‌ చేసే అత్యాధునిక వస్తువులు, ప్రాణాలను నిలిపే సెలైన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి అటవీ, కొండ ప్రాంతాల్లో జరిగే పోరాటాల్లో సైనికులకు అండగా నిలుస్తాయి. పుల్వామా వంటి ఘటన చోటు చేసుకున్న సందర్భంలో ఇటువంటి కిట్‌ ఉంటే మృతుల సంఖ్యను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అత్యవసర కిట్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్స్‌ (ఐఎన్‌ఎంఏఎస్‌) సంస్థ అభివృద్ధి చేసింది. యుద్ధరంగంలో ముఖ్యంగా అధిక రక్తస్రావం, షాక్‌, హైపోవొలెమియా, బాధ కారణంగా మరణిస్తుంటారు. ఈ మెడికల్‌ కిట్‌ యుద్ధరంగంలో సైనికదళాల ప్రాణాలను కాపాడుతుందని ఐఎన్‌ఎంఏఎస్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు.
కిట్‌లో ఉండేవి ఇవే..
ఈ యాంటీ న్యూక్లియర్‌ మెడికల్‌ కిట్‌లో దాదాపు 25 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ దాదాపు 80 నుంచి 90శాతం రేడియేషన్‌ పీల్చేసుకుంటాయి. రేడియేషన్‌ తగ్గించే టాబ్లెట్లు, పైపూత మందులు ఉన్నాయి. ప్రూసియన్‌ బ్లూ టాబ్లెట్లు, ఈడీటీఏ , ఊపిరి తీసుకోవడానికి సాయపడే రెస్పిరేటరీ ఫ్లూయిడ్‌, రేడియో యాక్టివ్‌ బ్లడ్‌ మ్యాపింగ్‌ డ్రెస్సింగ్‌, రేడియో యాక్టిక్‌ బయో ఫ్లూయిడ్‌ కలెక్టర్‌, యాంటీ గామా కిరణాల నుంచి రక్షించే పైపూత మందు, యామిఫాస్టిన్‌ ఇంజెక్షన్‌, ఇండ్రానిల్‌ 150 ఎంజీ టాబ్లెట్లు ఉంటాయి. దీంతో మన ఐఎన్‌ఎంఏఎస్‌ స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ న్యూక్లియర్‌ మెడికల్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని వెనుక ఐఎన్‌ఎంఏఎస్‌ శాస్త్రవేత్తల 20ఏళ్ల కృషి దాగి ఉంది. ఇది సైనికులకే కాదు సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/