ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసారు. దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను ఖరారు చేయబోతుండగా..NDA అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరును ఖరారు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ..అధిష్టానం మాత్రం ద్రౌపది ముర్ము ను ఖరారు చేసారు. మంగళవారం ఉదయం నుంచి సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రికి జేపీ నడ్డా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ అభ్యర్థిని ప్రకటించారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఆదివాసీ (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన వారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్​గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు.