చైనా దాష్టీకానికి చెక్‌ పెట్టాలి!

సరిహద్దుల హద్దులు నిర్ణయించి అంతర్జాతీయంగా గుర్తించబడాలి

Dragon‌ China border violations
Dragon‌ China border violations

భారత్‌ 1962లో వలె కాక చైనాను అడ్డగించే స్థితికి ఎదిగింది. ఇండియా తనను తాను రక్షించుకునే స్థితిలో ఉంది. కనుక డ్రాగన్‌ చైనా సరిహద్దు ఉల్లంఘనలు గత రెండు సంవత్సరాలుగా ఎదుర్కొని తననుతాను కాపాడుకోగలుగుతుంది.

భారత్‌ను అదుపు చేసేందుకు ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను, ఉగ్రవాదులను సరిహద్దులలో చైనా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందనేది అందరికి తెలుసు. భారత విదేశాంగ విధానం శాంతి సమాధానానికి సర్వత్రా గత 70 సంవత్సరాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. భారత్‌, చైనా సరిహద్దుల హద్దులు నిర్ణయించి అంతర్జాతీయంగా గుర్తించబడితేనే రెండు దేశాల మధ్య సఖ్యత కుదురుతుంది. లేకపోతే చైనా భారత్‌ను అప్పుడప్పుడు బెదిరిస్తూనే తన ప్రయోజనాలకు అడ్డురాకుండా చేసుకుంటుంది.

భారతదేశానికి తన సరిహద్దులలో చైనా విస్తరణ విధానం వలన పెద్ద ప్రమాదం పొంచి ఉంది. భారత్‌ తన సరి హద్దులను కాపాడుకోవడంలో చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. చైనా 1962లో భారత్‌పై యుద్ధానికి దిగింది. ఇప్పుడు అంత సులువ్ఞ కాదు. ఎందుకంటే భారత్‌ తనంత తానుగా యుద్ధానికి గాని, కయ్యానికి గాని దిగదు.

కానీ తనపై దాడిచేస్తే తగిన గుణ పాఠం చెబుతుంది. ఇది 2020 ఏప్రిల్‌లో తూర్పులడఖ్‌ ప్రాంతం లో గాల్వాన్‌ సరిహద్దులలో చైనా చొరబాట్లను భారత్‌ సమర్థ వంతంగా తిప్పికొట్టింది. అందుకు కారణం న్యూఢిల్లీలో సమర్థ వంతమైన కేంద్రప్రభుత్వమే కారణం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లో ప్రధాని నరేంద్రమోడీకి లోక్‌సభలో 543గాను 332 ఎంపిల మద్దతు ఉంది. కనుక అధికారంతో నిర్ణయాలు చేస్తూ చైనాకు తగిన కౌంటర్‌ ఎటాక్‌ చేయిస్తున్నారు.

అంతేగాక ప్రధాని మోడీ స్వయంగా తూర్పులడక్‌, గాల్వాన్‌ మిలిటరీ స్థావరాలను సంద ర్శించి సైనికులకు ధైర్యం, సంకల్పం, ఉత్తేజాన్ని కల్పించి చైనా దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఇక్కడ ఇండియా గుర్తుంచుకోవలసిన అంశం ఏమంటే 1962లో భారత్‌పై దండ యాత్ర చేసి 3.5 వేల కిలోమీటర్ల ప్రాంతం నిర్మూనుష్యం, మంచుకొండల ప్రాంతాన్ని ఆక్రమించుకొంది. ఆనాడు ఆప్రదేశం మానవ నివాసయోగ్యం కాదు. కనుక ఆనాటి ప్రధానులు ఆ ప్రాంతాలను పట్టించుకొనలేదు. ఆ సమయంలో భారత్‌కు అంత సత్తాకూడా లేదు.చైనా ఆర్మీని అంచనా వేయకుండా భారత్‌ చైనాతో యుద్ధానికి దిగింది.

ఆనాడు భారత్‌కు ఆర్మీ తప్ప వైమా నిక దళం అంత పటిష్టంగా లేకపోవడంతో భారత్‌ వెనుకంజ వేయడం జరిగింది. చైనా గెలిచింది. ఆనాటి నుండి 2019 వరకు భారత్‌,చైనాల మధ్యనున్న అతి పెద్దపొడవైన సరిహద్దు ప్రాంతా న్ని భారత్‌ కాపాడుకొంటూ సరిహద్దుదళాన్ని సరిహద్దు రోడ్డు నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని హిమాలయ సరిహద్దు కారిడార్‌ను బలపరుచుకొంది. భారత వాయుదళం 1962 కంటే ఆరు రెట్లు అధికంగా పెరిగింది. సైనిక దళాలు ముఖ్యంగా తుపాకీ దళంలో అత్యాధునిక ఆయుధాలను బోఫొర్స్‌గన్స్‌తోను.

ఎమ్‌.ఎమ్‌గన్స్‌, మౌంటౌన్‌ ఆర్మీదళం, గుర్ఖాదళం, అశ్వకదళంతోపాటు పలు యుద్ధటాంకులను రష్యా, అమెరికాల నుండి సమకూర్చుకుంది. అంతేగాక భారత్‌ మిలిటరీ బడ్జెట్‌ 2016-17లో రెండు లక్షల అరవై మూడు వేల 845 కోట్ల రూపాయలతో రక్షణ బడ్జెట్‌ను పెంచింది. అంటే దేశ జిడిపిలో 12.6 శాతం వరకు ఉంటుంది. ఇందులో భారత వైమానిక దళాన్ని ఆధునికం చేయడం, సరి హద్దులలో పనిచేసే సైనికులకు మంచును తట్టుకొనేందుకు దుస్తు లు, బూట్లు, సెక్యూరిటీ గాడ్జెట్స్‌, బుల్టెట్‌ప్రూఫ్‌ జాకెట్లకు అధికంగా కేటాయింపులు జరిపి వాస్తవికతతో సైనిక దళాలను పనిచేయించడం జరుగుతుంది.

బిజెపి ప్రభుత్వం రక్షణ మంత్రి పారికర్‌ ద్వారా తమకున్న లోక్‌సభ మెజారిటీతో తననుకున్న పనులు చేసుకుంటూ ముందుకుపోతున్నది. కాని 2019 ఆగస్టు ఐదున జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ కాశ్మీరు, లడక్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో చైనాకు ఇండో-చైనాల మధ్యనున్న సరిహద్దులలో రెండు దేశాల ప్రయోజనాల మధ్య సంఘర్షణలు, సరిహద్దు ప్రాంతంలో డ్రాగన్‌ దేశమైన చైనా సామ్రాజ్య విస్తరణ విధానానికి అడ్డుకట్ట వేసేందు కు భారత్‌ ప్రయత్నిస్తుందని తలచి 2019 అక్టోబర్‌ నుండి చైనా భారత్‌ల మధ్య సరిహద్దుల ఉల్లంఘనకు పాల్పడటం ప్రారంభిం చింది.

అంతేగాక చైనా తన విస్తరణ విధానంలో భాగంగా బీజింగ్‌-టెహరాన్‌లను కలుపుతూ హిమాలయ కారిడార్‌లో సిల్క్‌రోడ్డును ఆధునికరించడంలో భాగంగా చైనా 35 దేశాలతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి భారత్‌ను ఆహ్వానించింది. కానీ భారత్‌ ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఎందుకంటే ఎగువ హిమాలయాలలో పాత సిల్క్‌రోడ్డును పునరుద్దరించడం వలన చైనాకు వంద రెట్లు వాణిజ్యవ్యాపార లావాదేవీలు పెంచుకోవడమేగాక మొత్తం మధ్య ఆసియా ముస్లిం చమురు దేశాలను అదుపు చేసేందుకు రచించిన ప్రణాళికను భారత దేశం వ్యతిరేకించింది.

భారత్‌,ఇరాన్‌ దేశాల మధ్యఉన్న గ్యాస్‌పైప్‌లైన్‌ ప్రాజెక్టు రక్షణ సంబంధాల దృష్ట్యా ఇంకా మొదలు కాలేదు. అంతేగాక ఆప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ ఉగ్రవాద ప్రాతినిధ్యం కలిగిన ప్రాంతాల నుండి పైప్‌లైన్‌ భారత్‌కు వస్తుంది. కనుక వదలకుండా వాయిదా వేసుకుంది.

అంతేగాక ఇండియా అంత ర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ గత ఆరేళ్లుగా ప్రచారం చేస్తున్నారు.భారత రక్షణ విధానం కాని, దౌత్యవిధానం గాని శాంతి, సామరస్యాలతో కూడింది. కనుక ఇండియా ఎంతో సంయమనం పాటించినా చైనా తన అగ్రెస్సివ్‌ విస్తరణ విధా నాన్ని సామ్రాజ్యవాద కాంక్షతో భారత సరిహద్దులలో దుశ్చర్యలకు పాల్పడుతుంది.

అంతేగాక చైనా జిన్‌పింగ్‌ నాయకత్వాన తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొని రాబోయే దతాబ్దంలో చైనాను మరో అగ్రరాజ్యంగా రష్యాస్థానంలో రెండో అగ్రరాజ్యంగా చేసి అమెరికాకు దీటుగా ఎదగాలని తన రెడ్‌ ఆర్మీపాలనతో అంత ర్గతంగా ఆధిపత్యం పొంది, కమ్యూనిస్టు సిద్ధాంతాలను వదిలి క్యాపిటలిజంతో విస్తరణను చేపట్టి, తైవాన్‌, టిబెట్‌, మంగోలియా, ఇండియా, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను అదుపు చేయా లనే ఉద్దేశ్యంతో భారత్‌ చుట్టూ ఉన్నపక్క దేశాలను మిలిటరీ శిక్షణ పేరుతో బర్మా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌లో తనసైనిక స్థావరాలను ఏర్పరించింది.

ఇది గమనించిన ఇండియా ఏకైక అగ్ర రాజ్యమైనా అమెరికాకు దగ్గరై న్యూక్లియర్‌, రక్షణ, ఉత్పత్తుల సంబంధాలను పెంచుకొంటుంది. అంతేగాక చైనాను అంతర్జాతీ యంగా అదుపు చేయవలెనంటే ఇండియా లాంటి పెద్ద దేశం అండకావాలని గుర్తించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని మోడీల మధ్య మంచి సంబంధాలను నెలకొల్పారు.

తిరోగమించిన చైనా భారత్‌ను అంతర్జాతీయంగా ఎదగనీయకుండా చేయాలంటే ఏదో ఒక సమస్యను సృష్టించాలని, ఆ సమస్య చుట్టూ ఇండియా తిరుగుతూ చైనాపై దృష్టిపెట్టకుండా, ఉంచేం దుకు చైనా భారత సరిహద్దులలో కవ్వింపు చర్యలకు పాల్పడుతు న్నది.చైనా అప్పటికే నేపాల్‌ సరిహద్దులలో ఇండియా సరిహద్దుల వైపు డొక్లామ్‌ ప్రాంతంలో రోడ్లు నిర్మించి నేపాల్‌ను నియంత్రిం చింది. దలైలామా టిబెట్‌ వారసుడ్ని ప్రకటించే సమయం దగ్గర పడటంతో చైనా ఇండియాపై కక్ష గట్టింది.

ప్రపంచ దేశాల మద్దుతు కలిగిన ఇండియా చైనాకు అడ్డుతగలకుండా కట్టివేసేందుకు చైనా భారత సరిహద్దుల సమస్యలను వెలుగులోకి తెచ్చింది. భారత్‌ అమెరికాకు అండగా నిల్వకుండా తన ప్రయోజనాలకు అడ్డుతగల కుండా ఉండేందుకు ప్రయత్నంలో చైనా అమెరికా వ్యతిరేకతతో బయోలాజికల్‌ వార్‌ఫేర్‌ను సృష్టించిందని నిపుణులు చెబుతున్నా రు. అందుకే కొవిడ్‌-19 ఎపిడమిక్‌ను వదలి ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేసింది. దానితో అమెరికాలో కొవిడ్‌-19 వలన అధికంగా మరణాలు సంభవించాయి.

భారత్‌ గత రెండు దశాబ్దా లుగా ఫార్మారంగంలో ఎదిగింది. కొవిడ్‌-19 వలన నష్టం జరగ కుండా అత్యధిక జనాభాగల దేశమైనా తట్టుకొని నిలబడగలిగింది. అందుకే భారత్‌ 1962లో వలెకాక చైనాను అడ్డగించే స్థితికే ఎదిగింది. ఇండియా తనను తాను రక్షించుకునే స్థితిలో ఉంది. కనుక డ్రాగన్‌ చైనా సరిహద్దు ఉల్లంఘనలు గత రెండు సంవత్స రాలుగా ఎదుర్కొని తననుతాను కాపాడుకోగలుగుతుంది.భారత్‌ను అదుపు చేసేందుకు ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను, ఉగ్రవాదులను సరిహద్దులలో చైనా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందనేది అందరికి తెలుసు.

భారత విదేశాంగ విధానం శాంతి సమాధానానికి సర్వత్రా గత 70 సంవత్సరాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. భారత్‌, చైనా సరిహద్దుల హద్దులు నిర్ణయించి అంతర్జాతీ యంగా గుర్తించబడితేనే రెండు దేశాల మధ్య సఖ్యత కుదురు తుంది. లేకపోతే చైనా భారత్‌ను అప్పుడప్పుడు బెదిరిస్తూనే తన ప్రయోజనాలకు అడ్డురాకుండా చేసుకుంటుంది.

  • డా.కె.ఆసయ్య, ఐఐఎస్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/