మరో వివాదంలో చిక్కుకున్న హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్

హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మధ్య తరుచు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య కొన్ని పూజల్లో పాల్గొనడం , ఆ తర్వాత కేసీఆర్ కాళ్లు మొక్కడం వంటివి ఆయన్ను వివాదాల్లోకి నెట్టగా..తాజాగా రేపు కేసీఆర్ బర్త్ డే సందర్భాంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సర్క్యులర్ జారీ చేయడం ఆయన్ను వివాదంలోకి నెట్టేశాయి.

సీఎం పుట్టిన రోజున సందర్బంగా పండ్లు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించడం ఏంటి అని పలువురు ప్రశ్నింస్తున్నారు. గతంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ బర్త్ డేలో పాల్గొనలేదని నలుగురు అధికారులకు కమీషనర్ మోమో ఇచ్చారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలని నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం కూడా అప్పట్లో వివాదస్పదమైంది. ఇక ఇప్పుడు సీఎం పుట్టిన రోజు అని సర్క్యులర్ జారీ చేయడం మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.

రేపు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భాంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా పుట్టిన రోజు వేడుకలు జరపబోతున్నారు నేతలు. ఇప్పటికే తెలంగాణ లోని జిల్లాలన్నీ కూడా గులాబీమయం చేసారు. ప్రజా నాయకుడి జన్మదినం సందర్భంగా యావత్‌ ప్రజానీకం పులకించిపోతున్నది. జననేతకు పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కుతున్నాయి. కేక్‌ కటింగ్‌లతోపాటు మొక్కలు నాటడం.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. సామాన్య ప్రజానీకం సైతం భాగస్వామ్యులై వాడవాడల్లో పండుగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.