తెనాలి వైద్యశాలను సందర్శించిన రాష్ట్ర రీజనల్ డైరెక్టర్ డాక్టర్ షాలిని

తెనాలి వైద్యశాలను సందర్శించిన  రాష్ట్ర రీజనల్ డైరెక్టర్ డాక్టర్ షాలిని
Dr. Shalini, Regional Director of State ,visited Tenali Medical Center

Tenali: తెనాలి లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు రాష్ట్ర రీజనల్ డైరెక్టర్ డాక్టర్ షాలిని. అందరికి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భరత్ పక్షోత్సవాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా డాక్టర్ షాలిని తెనాలి ప్రభుత్వ వైద్యశాల ని సందర్శించి వైద్యం అందుతున్న తీరులు పరిశీలించారు. ఆయుష్మాన్ భావ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. 16 వ తేదీ నుండి అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలోని స్టీరింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

Dr. Shalini, Regional Director of State who visited Tenali Medical Center
Dr. Shalini, Regional Director of State who visited Tenali Medical Center

ఈ క్యాంపుల్లో  ౩౦ సంవత్సరాలు వయసు పై బడిన వారికి ఒకరి నుండి మరొకరికి వ్యాపించని వ్యాదులైన డయాబెటీస్, రక్తపోటు, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తారు. అనంతరం పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టు కనుగొన్నట్టు అయిత దగ్గరలోని వైద్యశాలకు పంపిస్తారు. ఎలా ౩౦ ఏళ్ళకి పైబడిన వారందరిని పరీక్షించడం లక్ష్యంగా ఈ  ఆయుష్మాన్ భావ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 2 న గ్రమ డెవలప్మెంట్ ప్లాన్ తయారుచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో  గ్రమ జనాభాలో ఎంత మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారో తెలిసిపోతుందన్నారు.

ఈ నెల 29 న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయెంచుకున్న వారి వివరాలని ప్రధాన మంత్రికి పంపడం జరుగుతుందని, ఆ రోజు హెల్త్ క్యాంప్ ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 1 న వృద్ధుల దినోత్వవం సందర్భంగా ప్రతి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 10 బెడ్లు వున్న వార్డును ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. తెనాలి వైద్యశాలలో ఏర్పాటు చేసిన వార్డు ఎలా ఉందొ పరిశీలించేందుకు తాను వచ్చినట్టు చెప్పారు.

ఓపీ, బ్లాడ్ టెస్టులు, మందులు తీసుకొను ప్రదేశాల్లో వృద్దులకు ప్రత్యేక లైన్ ఉండాలని తెలిపారు. ఈమెతో పాటు అడిషనల్  DM అండ్ HO డాక్టర్ సుబ్బారావు, వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర ప్రసాద్, RMO డాక్టర్ శ్రీనివాస రావు, AO డాక్టర్ రవి, డాక్టర్ హదస్సా తదితరులు వున్నారు. 

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/