డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ పతనం

DR REDDY's--
DR REDDY’s–

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ పతనం

న్యూఢిల్లీ: ఎపిలోని దువ్వాడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యుఎస్‌ఎఫ్‌ డిఎ 8లోపాలను గుర్తించినట్లు వెల్లడిం చడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 5.25శాతం క్షీణించి రూ.2458వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.2468వద్ద గరిష్టాన్ని, రూ.2423వద్ద కనిష్టానికి చేరింది. అదేవిధంగా కోల్‌ఇండి యా ఒఎఫ్‌ఎస్‌ ద్వారా 3శాతంవాటాను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలియడంతో ఈ షేరు డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3.5 శాతం పతనమై రూ.266వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.264వరకూ దిగజారింది. షేరుకి రూ.266ధరలో ఒఎఫ్‌ ఎస్‌ ద్వారా 3శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ప్రభుత్వం రూ.5వేల కోట్లను సమీకరించే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా ఒఎఫ్‌ఎస్‌కు ఓవర్‌ చందాదారులు లభిస్తే అదనంగా 6శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 78.32శాతం వాటా ఉంది.