‘స్పుత్నిక్‌–వి’ పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు ‘

సంరక్షణ బాధ్యత మాదే: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వెల్లడి

Dr. Reddy's Laboratories Revealed on Sputnik-V
Dr. Reddy’s Laboratories Revealed on Sputnik-V

స్పుత్నిక్‌– వి వ్యాక్సిన్ పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని, సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని పేర్కొంది కంపెనీ తరఫున వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి థర్డ్‌ పార్టీని నియమించలేదని స్పష్టం చేసింది . అనధికారిక వ్యక్తులు ఎవరైనా స్పుత్నిక్‌-వి టీకాను సరఫరా చేస్తామని చెబితే నమ్మవద్దని వెల్లడించింది . ఈ మేరకు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో (ఆర్‌డీఐఎఫ్‌) కలిసి డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్త ప్రకటన వెలువరించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/