ఏకపక్ష నిర్ణయాలు వీడండి

NewDelhi: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కేంద్ర ప్రభుత్వం వైఖరిని మరోసారి తప్పుబ ట్టారు. ఏకపక్ష నిర్ణయాలు సమాఖ్యవాదానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలను మార్చే విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభి ప్రాయాలను తీసుకోవాలని సూచించారు. జులైలో కేంద్రం నిబంధనలను మార్చింది. వివిధ మంత్రిత్వ శాఖలు ఖర్చు చేయని నిధు లను రక్షణ, అంతర్గత భద్రతకు కేటాయిం చేలా మార్గాలను సూచించమని ప్యానెల్‌ను కోరింది. దీనిపై మన్మోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లిలో జరిగిన ఆర్థిక కమిషన్ అదనపు నిబంధనల సూచనలపై జాతీయ సెమినార్లో సింగ్ మాట్లాడారు.