మే 6న దోస్త్‌ నోటిఫికేషన్‌!

DOST
DOST


హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మే 6వ తేదీన దోస్త్‌( డిగ్రీ ఆన్‌లైన్‌ సిస్టం ఆఫ్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు తెలిసింది. ఈ నెల 25లోగా గుర్తింపు పొందిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల జాబితాను దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఈ నెల 15 తర్వాత అన్ని వర్సిటీల విసిలతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించనున్నారు. ఇంటర్‌ విద్యార్ధుల జాబితాల కోసం ఇప్పటికే బోర్డుకు లేఖరాశామని చెప్పారు. దీంతో వచ్చేనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/