సోనియాకు దండం పెడుతున్నా…

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్య

Nirmala Sitharaman with Media
Nirmala Sitharaman with Media

ముఖ్యాంశాలు:

  • వలస కూలీల విషయంలో రాజకీయం చేయొద్దు
  • కూలీల విషయంలో అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం
  • కాంగ్రెస్‌ అధినేత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

New Delhi:

దేశంలో వలస కూలీల విషయంలో రాజకీయాలు చేయవద్దని కేంద్ర ఆర్థకమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐసిసి అధ్యక్షరాలు సోనియా గాంధీని కోరారు. ‌

వల‌స కూలీల అంశంపై అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని ఆమె ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కోరారు. 

ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ వ‌ల‌స కూలీల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే అంశంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి నిర్మ‌లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రెండు చేతులు జోడించి దండం పెడుతూ..  వ‌ల‌స కూలీల అంశం ప‌ట్ల‌ మ‌రింత బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలన్నారు. 

వ‌ల‌స కూలీల గురించి మాట్లాడాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సోనియాను కోరుతున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/