కేసీఆర్‌కు ఆ హక్కు లేదు

jeevan reddy
jeevan reddy

నిజామాబాద్: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి శుక్రవారం సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను కలిసి వారికి పూర్తి మద్దతు అందిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులను తొలగించే హక్కు తనకు లేదని, అలా చేస్తే ప్రజలు కేసీఆర్‌ను తొలగించే సమయం దగ్గర పడిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని, అవినీతి జాడలు సైతం లేని శాఖ అంటే అది ఆర్టీసీయేనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ కేసులో జైలు వెళ్లాల్సి వస్తుందని హితవుపలికారు. ఆర్టీసీని ప్రయివేటీకరణ చేసి, కార్మికుల బతుకులను రోడ్డు మీదకు తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని, ఇంధన ధరలు పెంచినందున, బస్‌ పాసుల మూలంగా ఆర్టీసీ వందల కోట్ల నష్టాన్ని చవిచూస్తుందన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/