మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి సుప్రీం షాక్

Mumbai Aarey colonists
Mumbai Aarey colonists

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో మహారాష్ట్రం ప్రభుత్వానికి షాక్ తగిలింది. మెట్రో రైలు డిపో కోసం నార్త్ ముంబయిలోని ఆరే కాల‌నీలో జ‌రుగుతున్న చెట్ల న‌రికివేత‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. చెట్ల న‌రికివేత‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. వృక్షాల‌ను న‌రికివేయ‌రాదు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరెస్టు చేసిన నిరసనకారులను వెంటనే విడుద‌ల చేయాల‌ని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 21న ఉంటుంద‌ని, అప్పటి వరకూ చెట్లను నరకివేయద్దని స్పష్టం చేసింది. మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌నలు వినిపించిన సోలిస‌ట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ఇక నుంచి అక్కడ చెట్ల‌ను కూల్చ‌మ‌ని కోర్టుకు తెలిపారు. సుప్రీం తీర్పుతో ఆరే కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు, ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముంబయిలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ కోసం ఆరే కాలనీలో ఉన్న చెట్లను వేయ్యికి పైగా నరికివేయడంతో దుమారం రేగింది. చెట్లను నరకడానికి వీల్లేదంటూఉ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళనకు దిగారు. చెట్ల నరికివేతపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ఇక, లా స్టూడెంట్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ కూడా రాశారు. చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని ఆదేశించాలని కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/