కరోనా వైరస్‌ పై పుకార్లు నమ్మొద్దు

Etala Rajender
Etala Rajender

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ చైనాతో పాటు ఇతర దేశాలకు కూడా వణికిస్త్తుంది. అయితే ఈవైరస్‌ తెలంగాణలో కూడా పాకుతుందన వార్తలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆయన అన్నారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తోందని, బుధవారం కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. కేంద్ర బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులను పరిశీలిస్తోందని, రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/