‘సామాజిక బాధ్యతగా విరాళాలు హర్షణీయం’

తెలంగాణ మంత్రి హరీష్ రావు అభినందన

'సామాజిక బాధ్యతగా  విరాళాలు హర్షణీయం'
Donations to the Chief Minister’s Aid Fund

Hyderabad: కరోనా  బాధితుల‌  సహాయార్ధం ముఖ్యమంత్రి  సహాయ నిధికి  విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు , ఆయన నివాసముంటున్న వసంత్ వ్యాలీ కాలనీ వాసి బి. గంగాధర్ రావు లక్ష‌రూపాయల చెక్ ను అందజేసారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాజిక బాధ్యతగా భావించి విరాళాలు ఇవ్వడం హర్షణీయమని మంత్రి హరీశ్ రావు గంగాధరరావు ను అభినందించారు.

ఇంట్లోనే ఉండి కరోనాను వ్యాప్తి చెందకుండా చేయడమే నేటి తరుణంలో నిజమైన సామాజిక బాధ్యత అని చెప్పారు. ఈ క్రతువులో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

సామాజిక దూరం పాటించడం, ప్రభుత్వ సూచనలు తు.చ తప్పకుండా పాఠించడం ప్రతీ పౌరుని బాధ్యత అన్నారు.

క్వారంటైన్ లో‌ఉన్న వారు ప్రభుత్వ, వైద్యల సూచనలు అనుసరించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/