త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన ట్రంప్

ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ఘటన

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌ఫోర్స్1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/