పెరుగుతున్న వాణిజ్య అంతరాలు

పెరుగుతున్న వాణిజ్య అంతరాలు
నేటినుంచి చైనా ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల సుంకాలు
వాషింగ్టన్: అమెరికా,చైనాలమధ్య జరుగుతున్న వాణిజ్యయుద్ధం మరింత ముదురు తోంది. నేటినుంచి అమెరికా చైనా ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల సుంకాలను విధించ నున్నట్లు వెల్లడి అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఈమేరకుతన సుముఖతను వ్యక్తం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇంటర్నెట్ టెక్నాలజీ ఉత్పత్తులు, ఇతర ఎలక్ట్రానిక్స్,ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, విని యోగరంగ ఉత్పత్తులు, చైనా సీఫుడ్, ఫర్నిచర్, లైటింగ్ ఉత్పత్తులు, టైర్లు, రసాయనాలు, ప్లాస్టిక్స్,సైకిళ్లు, చిన్నపిల్లలకు కారు సీట్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ సుంకాలు ఇంచుమించుగా పదిశాతంనుంచి ఉంటాయని వెల్లడి అయింది. ముందు పాలనాయంత్రాంగం చెప్పిన 25శాతం కంటే తక్కువే. అయితేట్రంప్ పాలనా యంత్రాంగం వీటిలో కొన్నింటికైనా మిన హాయింపులు ఇస్తుందా లేదా అన్నది స్పష్టం కాలేదు.
మొత్తం ఇప్పటివరకూ 1300 రకాల చైనా ఉత్పత్తులపై సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. జులైలో ప్రకటించిన ఉత్పత్తుల్లో కొంతవరకూ మినహా యింపులుంటాయన్నప్రచారం జరిగింది. శ్వేత సౌధం అధికారమహిళా ప్రతినిధి లిండ్సే వాల్ట ర్స్మాట్లాడుతూ చైనా సహేతుకంగా లేని వాణ ిజ్య విధానాలనుకట్టడిచేసేందుకు ట్రంప్, అమె రికా యంత్రంగం సన్నద్ధంగా ఉందని వెల్లడిం చారు. అమెరికా వ్యక్తంచేసిన దీర్ఘకాలంగా ఎదుర వుతున్న సమస్యలపై చైనా ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ ఇప్పటికే తన అధికార యంత్రాంగాన్ని సుంకాలను వసూలుచేయాలని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆర్ధిక మంత్రి స్టీవెన్ మ్నుచిన్ ఇప్పటికే చైనాతో ఇందుకు సంబంధించి చర్చలుప్రారంభించారు.
చైనా తన 375 బిలియన్డాలర్ల వాణిజ్యమిగులును క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. అమెరికా టెక్నాలజీ, మేధోహక్కుల సంపత్తి, హైటెక్ పారిశ్రామిక సబ్సిడీలను మినహాయిస్తామని సైతం హెచ్చరించారు. అమెరికా ఆర్ధికశాఖ చైనా సీనియర్ అధికారులను చర్చలకు ఆహ్వానించింది. వీరిలో వైస్‌ప్రీమియర్ లియు హే కూడా ఉన్నారు. ఇప్పటికే యంత్రాంగం 50బిలియన్డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ఈనెల ఏడవ తేదీ ట్రంప్ చైనాను హెచ్చరిస్తూ 267 బిలియన్ డాలర్ల చైనత దిగుమతులపై సుంకాలు విధిస్తామని వెల్లడించారు. మొత్తంచైనా దిగుమతులపై సుంకాలు విధిస్తే 505 బిలియన్డాలర్లకుసైతం ఉంటుందని అన్నారు. ఈ ఏడాది చైనానుంచి దిగమతిఅవుతున్న ఉత్పత్తులు తొమ్మిదిశాతంపెరిగాయి.